: ములాయం, అఖిలేష్ ఏం చేయగలరు? : మధ్యప్రదేశ్ హోం మంత్రి
ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచార ఘటనలపై ములాయం సింగ్ యాదవ్, ఆఖిలేష్ యాదవ్ లను బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ వెనుకేసుకొచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బదౌన్ అత్యాచార ఘటనలో ఆ తండ్రీ కొడుకులు ఏం చేయగలరని ప్రశ్నించారు. వారిద్దరూ నిస్సహాయులని, అత్యాచార నిరోధానికి వారేం చేయగలరని ఆయన అన్నారు. పురుషుడు మానసిక సమతౌల్యం కోల్పోయినపుడే అత్యాచారానికి ఒడిగడతాడని బాబూలాల్ గౌర్ విశ్లేషించారు.