: సిగ్గుతో తల దించుకుంటున్నా: అరుంధతీ భట్టాచార్య
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వార్తాపత్రికల్లో చదివిన ప్రతిసారి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ఎస్ బీఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై కేరళలోని తిరువనంతపురంలో ఆమె మాట్లాడుతూ, దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు అంతర్జాతీయ యవనికపై భారత సాంస్కృతిక ముఖచిత్రానికి నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. మహిళలపై హింసను కేంద్రంలోని బీజేపీ, ఎన్డీయే కూటమి నిరోధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక, విద్యాపరమైన స్వావలంబనతోనే మహిళలపై నేరాలు తగ్గుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.