: ఉత్తరప్రదేశ్ లో రేపిస్టులను రాజకీయ నాయకులే రక్షిస్తున్నారు: ఉమాభారతి
ఉత్తరప్రదేశ్ లో రాజకీయ నాయకులు, ప్రభుత్వం ఉమ్మడిగా రేపిస్టులను రక్షిస్తున్నాయని కేంద్ర మంత్రి ఉమాభారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న దురాగతాలపై పార్లమెంటులో చర్చిస్తామని అన్నారు. మహిళలపై నేరాలకు ఉత్తరప్రదేశ్ రాజధానిగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో యాదవ్ ల పాలన గాడి తప్పిందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ మాట్లాడుతూ, ఒకే రాష్ట్రాన్ని పదేపదే నిందించడం సరికాదని అన్నారు.