: ఎన్నికల్లో ప్రజాతీర్పు శిరోధార్యం: పురంధేశ్వరి
లోక్ సభ ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసిన బీజేపీ నేత పురంధేశ్వరి ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దానిపై ఆమె స్పందిస్తూ, ప్రజాతీర్పు శిరోధార్యమన్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానని చెప్పారు. రాజంపేటలో తనకు సహకరించిన బీజేపీ, టీడీపీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రాజంపేట పరిధిలోని ఏడు నియోజకవర్గాల నేతలతో పురంధేశ్వరి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానన్నారు. ప్రజాసేవకు గెలుపోటములతో పనిలేదన్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.