: వెంకయ్యాజీ! నన్ను రెండో వరుసలో కూర్చోనివ్వండి: అద్వానీ
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు (నిన్న) బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ప్రధాని నరేంద్ర మోడీ పక్కన మొదటి వరుసలో కూర్చున్నారు. ఈ రోజు మాత్రం అలా కూర్చోలేదు. తొలి వరుసలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూర్చుంటారు. ప్రతిపక్ష నేత, కీలక నేతలు కూడా లోక్ సభలో తొలి వరుసలో కూర్చోవడం సంప్రదాయం. అయితే, తొలి వరుసలో కూర్చోవడం ఇష్టం లేని అద్వానీ రెండో వరుసలో కూర్చునేందుకు వెళ్లారు.
ఆ మేరకు పార్లమెంటరీ శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో తనను రెండో వరుసలో కూర్చోనివ్వాలని సూచించారు. ఆయన సూచనను సున్నితంగా తిరస్కరించిన వెంకయ్యనాయుడు ఆయనను తొలి వరుసలోనే కూర్చోవాలని అభ్యర్థించారు. దీంతో ఆయన మోడీ పక్కన కాకుండా కొంచెం దూరంగా కూర్చున్నారు. లాస్ట్ బెంచ్ అబ్బాయి రాహుల్ గాంధీ మాత్రం అదే బెంచ్ లో ఉన్న ఎన్సీపీ ఎంపీ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేతో సుదీర్ఘ మంతనాల్లో మునిగిపోయారు.