: మోసం చేస్తే కేసీఆర్ ను ప్రజలు క్షమించరు: డీఎస్
ప్రజలకు మంచి చేస్తే కేసీఆర్ కు తమ సహకారం అందిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ అన్నారు. రైతు రుణ మాఫీని నీరుగార్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. రుణ మాఫీ హామీలో మెలికలు పెట్టి మోసం చేస్తే కేసీఆర్ ను ప్రజలు క్షమించరని అన్నారు. రైతులు రుణం తీసుకోవడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. షరతులతో కూడిన రుణ మాఫీతో రైతులకు ఒనగూడేది ఏమీ లేదని... కేసీఆర్ తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు.