: ప్రధాని మోడీకి కిషన్ రెడ్డి, నాగం విన్నపాలు
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత నాగం జనార్ధనరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన సందర్భంగా తెలంగాణలోని సమస్యలను ఏకరువుపెట్టారు. ప్రధానంగా ఫ్లోరైడ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ముంపు మండలాలను ఆంధ్రాలో కలపడంపై తెలంగాణలో వెల్లువెత్తుతున్న నిరసనలను మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే రాజయ్య చేపట్టిన దీక్ష గురించి ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధికి అదనంగా నిధులు కేటాయించాలని ప్రధానిని కిషన్ రెడ్డి, నాగం కోరారు.