: పెద్ద రాష్ట్రాల్లో అత్యాచారాలు సహజం: ఎస్పీ నేతల సంచలన వ్యాఖ్యలు


ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అచ్చం ఈ సామెత లాగే ఉన్నాయి సమాజ్ వాదీ పార్టీ నేతల తీరుతెన్నులు. 'కుర్రాళ్లు తప్పులు చేస్తుంటారు సహజం, అత్యాచారానికి ఉరి శిక్ష సరికాదు' అంటూ ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆమధ్య వ్యాఖ్యానించగా, అదే పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్ 'యువతీ యువకుల మధ్య సంబంధాలు చెడితే అత్యాచారం చేశారంటూ బాధిత మహిళలు ఆరోపణలు చేస్తున్నారు' అంటూ తాజాగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

వారిద్దరి తరువాత సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 'ఒక్క యూపీలోనే అత్యాచారాలు జరుగుతున్నాయా? దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి, కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి వెతుక్కోండి' అంటూ సవాలు విసిరారు. తాజాగా ఆ పార్టీ నేత మోహిసిన్ ఖాన్ మాట్లాడుతూ, దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ అని, అలాంటి రాష్ట్రంలో అత్యాచారాలు సహజమని సెలవిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News