: ప్రసవాన్ని షూట్ చేసి... ఆపై వీడియో పంపిణీ


ఓ మహిళ ప్రసవాన్ని అనైతికంగా మొబైల్ లో చిత్రీకరించడమే కాకుండా ఆ వీడియోను పంపిణీ చేశారు ఉన్మాదం తలకెక్కిన ఆస్పత్రి సిబ్బంది. రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లాలో ఇది జరిగింది. ప్రసవం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ మహిళ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేరింది. ఆమె బిడ్డను ప్రసవిస్తున్న తీరును కొందరు ఉద్యోగులు మొబైల్ లో చిత్రీకరించి ఆ వీడియోను తెలిసిన వారికి పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ మహిళ కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారు మరికొందరితో కలసి హెల్త్ సెంటర్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మగ నర్సు ప్రేమ్ చంద్ మీనా, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఉద్యోగి ప్రేమ్ చంద్ గుప్తా, అంబులెన్స్ డ్రైవర్ తరుణ్ జైన్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News