: కాజల్ కల్లుకి సమంతా కల్లుతో పోటీ!
కాజల్ 'కల్లు'కి సమంతా కల్లుతో పోటీ పడింది... దేని టేస్టు దానిదేనంటూ కల్లు ప్రియులు మాత్రం కాజల్, సమంతా కల్లు వెంటపడుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రిలో ఉన్న తాడిచెట్లకు హీరోయిన్ల పేర్లు పెట్టి కల్లుకు మంచి డిమాండ్ పెంచుకుంటున్నారు గీత కార్మికులు. కల్లుతాగే సినీ అభిమానులు కూడా తమ అభిమాన హీరోయిన్ పేరున్న చెట్టు కల్లునే కోరుకుంటున్నారు.
తాజాగా కాజల్, నయనతార, సమంత, త్రిష, తమన్నా పేర్లున్న కల్లు బాగా అమ్ముడుపోతోంది. 'కల్తీలేని స్వచ్చమైన కల్లు కావాలంటే చిరుమర్రి రండి. మీకిష్టమైన హీరోయిన్ కల్లు తాగండి' అంటూ గీత కార్మికులు జోరుగా లాభాలార్జిస్తున్నారు.