: కొన్ని గంటల్లో భారత్ లోకి ప్రవేశించనున్న రుతుపవనాలు
మరి కొన్ని గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నాయి. మరో 24 గంటల్లో ఇవి విస్తరించడానికి అనువైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కేరళతో పాటు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తొలకరి జల్లులు కురవనున్నాయి. అంతేకాకుండా దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్, మాల్దీవులు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. మన రాష్ట్రం విషయానికొస్తే, రెండో వారంలో రాయలసీమలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి.