: సినీ పరిశ్రమలో తెలంగాణ కళాకారులందరికీ అవకాశం: డిప్యూటీ సీఎం
సినిమా పరిశ్రమలో తెలంగాణ కళాకారులందరికీ అవకాశం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ కళాకారులకు అన్యాయం జరుగుతోందన్న ఆయన, సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని హైదరాబాదులో జరిగిన ఓ సమావేశంలో హామీ ఇచ్చారు.