: ఇద్దరు డీజీపీల సమక్షంలో ప్రసాదరావుకు ఘనంగా వీడ్కోలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి డీజీపీగా పనిచేసిన ప్రసాదరావుకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనమైన వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ఏపీ డీజీపీ రాముడు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మలు హాజరయ్యారు. చివరిసారిగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసాదరావు మాట్లాడుతూ, మన పోలీసులకు దేశంలోనే అత్యంత గొప్ప పేరు ఉందని కొనియాడారు. ఏ సమస్య వచ్చినా మన పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కోగలరని అన్నారు. పోలీసుల త్యాగాలతోనే రెండు రాష్ట్రాల్లో శాంతి నెలకొందని... మావోయిస్టుల సమస్యను కూడా పూర్తిగా ఎదుర్కొన్నామని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో పోలీసుల కీర్తిని మరింతగా పెంచాలని ఈ సందర్భంగా ఆయన అభిలషించారు.