: తిరుమలలో గోవింద నామం తప్ప మరేదీ వినపడకుండా చేస్తా: చంద్రబాబు
అన్ని విధాలుగా అపవిత్రమైన తిరుమలను సమూలంగా ప్రక్షాళన చేస్తానని కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో గోవింద నామం తప్ప మరేదీ వినిపించకుండా చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. భక్తులకు అందించే ప్రాణదానం (ఉచిత వైద్య సదుపాయం) పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. స్వామి వారి అనుగ్రహంతో కొత్త రాష్ట్రంలో అవినీతి రహిత, పేదరికం లేని సమాజం కోసం పాటుపడతామని చెప్పారు.