: యాక్సిస్ బ్యాంక్ ప్రచారకర్తగా అందాల భామ
బాలీవుడ్ లో ఘనవిజయాలు సాధిస్తూ మంచి జోరుమీదున్న అందాలభామ దీపిక పదుకునే మరో వాణిజ్య ప్రకటన ఒప్పందం కుదుర్చుకుంది. యాక్సిస్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు దీపిక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ముంబైలో సంతకాలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత ఆర్థిక రంగంలో యాక్సిస్ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తోందని, అలాంటి బ్యాంకు బృందంలో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. ఈ మేరకు ఇంగ్లీష్ వింగ్లీష్ దర్శకుడు గౌరీ షిండే రూపొందిచనున్న వాణిజ్య ప్రకటనలో దీపిక నటించనుంది.