: ఇదీ టీడీఎల్పీ సమావేశం జరిగే తీరుతెన్ను
తిరుపతిలో ఈ సాయంత్రం 7 గంటలకు జరగాల్సిన టీడీపీ శాసనసభా పక్ష సమావేశం రాత్రి 8.15 గంటలకు ప్రారంభం కానుంది. అనంతరం 8.25 నిమిషాలకు టీడీఎల్పీ నేతగా చంద్రబాబు పేరును కేఈ కృష్ణమూర్తి ప్రతిపాదిస్తారు. 8.30 నిమిషాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాబును బలపరుస్తారు. 8.51 నిమిషాలకు టీడీపీ శాసనసభా పక్ష నేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. 8.52 నుంచి 9.30 గంటల వరకు చంద్రబాబుకు అభినందనలు, సత్కారం జరుగుతాయి. రాత్రి 9.30 నిమిషాలకు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ప్రసంగిస్తారు.