: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన శిరీష
విజయవాడలో కట్టుకున్న భర్తే కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో బాధితురాలు శిరీష కన్నుమూసింది. మొగల్రాజపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో ఆసుపత్రి ఎదుట శిరీష బంధువులు ఆందోళనకు దిగారు. ఆమె మరణానికి కారకులైన భర్త, అత్తమామలను శిక్షించాలంటూ వారు నినాదాలు చేశారు.