: ధవళేశ్వరం పడవ బోల్తా బాధిత కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం సున్నపుబట్టీ రేవులో నిన్న (మంగళవారం) నాటు పడవ బోల్తా పడి ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను ఈ రోజు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అలాగే మధురపూడి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలను కూడా జగన్ పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.