: హైదరాబాదులో ఓ పెట్రోల్ బంక్ సీజ్
హైదరాబాదులోని ఉప్పల్ ఏరియాలో ఉన్న పలు పెట్రోలు బంకులపై తూనికలు, కొలతల శాఖాధికారులు దాడులు జరిపారు. కల్తీ పెట్రోలును విక్రయిస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఈ దాడుల్లో అధికారులు ఓ బంక్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, సీజ్ చేశారు.