: విలన్ పాత్రకు ఫ్లాట్ అయ్యి... విలన్స్ గా మారారు
ఇంటర్నెట్ లో పిల్లలను ఏది పడితే అది చూడనిస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలియజేసే ఘటన అమెరికాలో జరిగింది. 12 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు ఓ వెబ్ సైట్ లో ఓ కల్పిత కథను చదివారు. అందులో సన్నగా ఉండే విలన్ పాత్ర వారికి తెగ నచ్చేసింది. అతడి స్ఫూర్తిగా ఆ ఇద్దరు బాలికలు ఏం చేశారో తెలుసా? వారిలో ఒకరు విస్కాన్సిన్ లోని వౌకేషలో ఉన్న తమ ఇంటికి ఒక స్నేహితురాలిని ఆహ్వానించారు. అనంతరం సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లి 19 సార్లు పొడిచి పరారయ్యారు. దారిన వెళ్లే ఓ సైక్లిస్ట్ ఆమెను చూసి ఆస్పత్రిలో చేర్పించగా... చికిత్సతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఎవరైనా ఒకరిని చంపి విలన్ పట్ల ఉన్న భక్తిని చాటుకోవాలనిపించి ఈ పనికి పాల్పడినట్టు విచారణలో ఆ ఇద్దరు బాలికలు తెలిపారు!