: తెలంగాణలో రూ.లక్ష వరకే రుణ మాఫీ
తెలంగాణలో రూ.లక్ష లోపు రైతుల రుణ మాఫీ చేసేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ప్రధానంగా దీనిపైనే చర్చించారు. 2013 జూన్ నుంచి 2014 జూన్ వరకు రూ.లక్ష లోపు రుణాల వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాంకు అధికారులను కోరారు. రేపటిలోగా బ్యాంకుల వారీగా రుణాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. దాంతో, వచ్చే వారం మరోసారి బ్యాంకర్లతో సమావేశం జరగనుంది. మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.