: హైదరాబాదులోని హఫీజ్ పేటలో ఉద్రిక్తత


రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్ పేటలో గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ నీలం రవీందర్ లు మద్దతు ఇస్తూ ధర్నా చేశారు. దీంతో హఫీజ్ పేటలో భారీగా పోలీసులు మోహరించారు.

  • Loading...

More Telugu News