: తిరుమలేశుని సన్నిధిలో టీడీపీ నేతలు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు పలువురు టీడీపీ నేతలు చేరుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, శమంతకమణి, తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు వెంకట్రావు, పితాని సత్యనారాయణ, మండలి బుద్ధప్రసాద్, బొండా ఉమా, ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు తిరుమలేశుడిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.