: సచివాలయం 'సీ బ్లాక్' ఎదుట తెలంగాణ ఉద్యోగుల ఆందోళన
హైదరాబాదులోని సచివాలయం సీ బ్లాక్ ఎదుట వెయ్యి మంది గ్రూప్-4 తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగుల విభజనలో భాగంగా తెలంగాణ ఉద్యోగులైన తమను ఆంధ్రాకు బదిలీ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కోసం పోరాడింది ఆంధ్రాలో పనిచేయడానికా? అని ప్రశ్నిస్తున్నారు. యూనియన్లు తమగోడు పట్టించుకోవడం లేదని తెలంగాణ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.