: పోలీసుల చేతికి చిక్కిన ఎర్రచందనం స్మగ్లర్
ఎర్రచందనం స్మగ్లర్ శ్రీనివాసుల నాయుడు కడప జిల్లా పోలీసుల చేతికి చిక్కాడు. తిరుపతిలో శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నామని కడప జిల్లా మైదుకూరు పోలీసులు చెప్పారు. కడప ఏఎస్పీ రమణ ఆధ్వర్యంలో అతడిని విచారిస్తున్నట్లు తెలిసింది. శ్రీనివాసులు ఆస్తుల జప్తుపై పోలీసులు దృష్టి సారించారు.