: మళ్లీ సోంపేట గరంగరం.. ధర్మాన పర్యటనకు నిరసన సెగ?


మళ్లీ సోంపేట ఉద్రిక్తంగా మారుతోంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు నిరసనగా స్థానికులు ఎన్నాళ్లుగానో ఉద్యమిస్తున్నారు. వీరి పోరాటం ఫలితంగానే థర్మల్ విద్యుత్ కర్మాగారం పనులు నిలిచిపోయాయి. సోంపేట కొంత శాంతించింది. ఇప్పుడు మళ్లీ సోంపేట ఉద్యమకారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఈ రోజు సోంపేటలో పర్యటిస్తుండడమే ఈ ఉద్రిక్తతకు కారణం.

మంత్రి పర్యటనను ఎలాగైనా అడ్డుకుని తీరుతామని థర్మల్ వ్యతిరేక ఉద్యమకారులు ప్రకటించారు. బీల ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ఏర్పాటుకు ఉద్దేశించిన జీవో 1107ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి పర్యటనను అడ్డుకునేందుకు సోంపేట సమీపంలోని 25 గ్రామాలకు చెందిన మత్స్యకారులు సిద్దమయ్యారు. దీంతో ఇక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మరికొద్ది సేపట్లో భారీ బందోబస్తు మధ్య ధర్మాన సోంపేటకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోంపేట ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News