: ఇవాళ దేవినేని వెంకటరమణ 15వ వర్థంతి
మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ 15వ వర్థంతిని కృష్ణాజిల్లా నందిగామలో నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు రైతుపేటలోని వెంకటరమణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందిగామలోని గాంధీ సెంటర్ లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.