: బాధ్యతలు చేపట్టిన ఈటెల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఈ రోజు సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా ఈ నెల 2న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజేందర్ ప్రకటించారు. ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూస్తామన్నారు. రైతుల రుణమాఫీకి సంబంధించి ఈ రోజు బ్యాంకర్లతో సమీక్ష సమావేశం జరగనుంది.