: పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగాలుల బీభత్సం
పశ్చమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. పెనుగాలుల ధాటికి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో 25 గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకొంది.