: రాజమండ్రి రేవులో పడవ బోల్తా, ఐదుగురు గల్లంతు


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం సున్నపుబట్టీ రేవులో నాటుపడవ బోల్తా పడింది. భారీ ఈదురుగాలులు వీయడంతో పడవ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారంతా కోరుకొండకు చెందిన ఒకే కుటుంబం వారని తెలిసింది.

  • Loading...

More Telugu News