: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సి.రామచంద్రయ్య
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా సి.రామచంద్రయ్య ఎన్నికయ్యారు. ఇందిరాభవన్ లో ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, వాయిలార్ రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సి.రామచంద్రయ్యను ఫ్లోర్ లీడర్ గా ఎమ్మెల్సీలు ఎన్నుకున్నారు. కాగా, శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టడంతో శాసనసభలో ఆ పార్టీ ఉనికి లేకుండా తుడిచిపెట్టుకుపోయింది.