: రేపు లాతూరులో గోపీనాథ్ ముండే అంత్యక్రియలు
ఢిల్లీలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే భౌతికకాయం ముంబయి నగరానికి చేరుకుంది. రేపు (బుధవారం) మహారాష్ట్రలోని లాతూరులో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ముండే అకస్మిక మరణం విస్మయానికి గురిచేసిందని రాష్ట్రపతి అన్నారు. ముండే మరణంతో ఒక ప్రజానాయకుడిని కోల్పోయామని ప్రదాని మోడీ అన్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.