: పసిడి, వెండి ధరలు
శనివారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు చూస్తే... హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ముగింపు ధర రూ. 30,000గా ఉంది. విజయవాడలోనూ రూ.30,000 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో శుక్రవారం రూ.29,660 వద్ద ముగియగా, శనివారం కొంత పెరిగి రూ.30,000 వద్ద ముగిసింది.
ఇక విశాఖపట్నంలో రూ.29,460 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,920 వద్ద ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.54,600 పలికింది. ప్రొద్దుటూరులో రూ.52,000 వద్ద ముగియగా, విశాఖలో 53,000, రాజమండ్రి మార్కెట్ లో 53,000 వద్ద ముగిసింది.