: సీపీఎం నేత, ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్ష విరమణ


సీపీఎం నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య దీక్ష విరమించారు. ఆయన గత నాలుగు రోజులుగా పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. రాజయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆసుపత్రికి వెళ్లి, సున్నం రాజయ్యకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో తాను దీక్షను విరమిస్తున్నట్లు రాజయ్య చెప్పారు.

  • Loading...

More Telugu News