: గోపీనాథ్ ముండే మృతికి రెండు రోజుల పాటు సంతాప దినాలు
కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతి పట్ల రెండు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు పాటించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ముండేకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని కూడా నిర్ణయించింది. కేంద్ర మంత్రివర్గం సమావేశమై ముండేకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేసింది. కాగా, రేపటి నుంచి వారం రోజుల పాటు యథావిధిగా లోక్ సభ సమావేశాలు జరుగుతాయి. అయితే, రేపు జరగాల్సిన కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం మాత్రం ఎల్లుండికి వాయిదా వేశారు.