: చంద్రబాబుకు దీటుగా లాబీయింగ్ చేస్తా... నిధులు తెస్తా: జితేందర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దీటుగా లాబీయింగ్ చేస్తానని... తెలంగాణకు అవసరమైన నిధులు, ప్రాజెక్టులు తీసుకొస్తానని మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ లోక్ సభ నేత జితేందర్ రెడ్డి తెలిపారు. బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలతో దీన్ని సాధిస్తానని చెప్పారు. పార్లమెంటు మొదటి సమావేశాల్లోనే పోలవరం ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా తమ వాణి వినిపిస్తామని తెలిపారు. తెలంగాణకు ఎన్డీయే ప్రభుత్వం అన్యాయం చేస్తే పోరాడతామని చెప్పారు. త్వరలోనే ప్రధాని మోడీని కలసి తెలంగాణకు ఆహ్వానిస్తామని తెలిపారు.