: కాంపాకోలా అక్రమ నివాసాలను కూల్చివేయండి: సుప్రీం కోర్టు
ముంబైలోని కాంపాకోలా సొసైటీలో వెలసిన అక్రమ నివాసాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. వెంటనే అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. సొసైటీలోని 102 ఫ్లాట్లలో నివసిస్తున్న వారు అక్కడే నివసించడానికి చేసిన అభ్యర్థనను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. నివాసం ఉంటున్న వారు తమ ఇళ్లను ఖాళీ చేయడానికి 2014 మే 31 వరకు ఇచ్చిన గడువు ముగియడంతో సుప్రీం ఈ ఆదేశాలను జారీ చేసింది. నివాసం ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయింది... అక్రమ నివాసాలను కూల్చి వేయాలని స్పష్టం చేసింది.