: ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. పార్లమెంటరీ పార్టీ నేతను నిర్ణయించే అధికారం చంద్రబాబునాయుడుకే ఆ పార్టీ ఎంపీలు వదిలేశారు. చంద్రబాబునాయుడు సూచించిన వ్యక్తికే తమ మద్దతు ఉంటుందని ఎంపీలు స్పష్టం చేశారు. దీంతో పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు నేటి సాయంత్రం ఎంపిక చేయనున్నారని సమాచారం.