: బీజేపీ ప్రధాన కార్యాలయంలో ముండే భౌతిక కాయానికి నివాళులు


ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి దివంగత గోపీనాథ్ ముండే భౌతిక కాయానికి ఆ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు అన్ని పార్టీల నేతలు క్యూ కట్టారు. సీనియర్ నేతలంతా పుష్పగుచ్ఛాలతో ఆయన భౌతిక కాయానికి శ్రధ్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలు, మిత్రపక్షాల నేతలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులంతా ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను అద్వానీ ఓదార్చారు. నేటి సాయంత్రం ఆయన మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించనున్నారు.

  • Loading...

More Telugu News