: ముగ్గురు బాలికలపై అత్యాచారం... వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి


రాజస్థాన్ లో ముగ్గురు బాలికలపై ముష్కరులు కన్నేసి... కన్నెతనాన్ని చిదిమేశారు. ఓ 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. రాజస్థాన్ లోని ఖోలి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక తన మేకలను మేతకు తీసుకెళ్లి ఇల్లు చేరలేదు. మరుసటి రోజు గ్రామానికి కిలోమీటరు దూరంలో విగతజీవిగా కనిపించింది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరో సంఘటనలో అదే జిల్లాలోని నారాయణపుర గ్రామంలో ఐదేళ్ల బాలికపై ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇంకో సంఘటనలో దౌసా జిల్లాలో 15 ఏళ్ల దళిత బాలిక ఇంట్లో చొరబడి అత్యాచారం చేశారు. వీటిపై దుమారం చెలరేగడంతో వెంటనే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె సింథియా స్పందించారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో సత్వరమే స్పందించిన పోలీసులు మూడు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్ కు పంపారు. హత్య కేసులో ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News