: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు వీరే!


టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలను కేసీఆర్ ఎంపిక చేశారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న కె.కేశవరావు (కేకే)ను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. అలాగే టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేతగా జితేందర్ రెడ్డిని, ఉపనేతగా వినోద్ ను ఎంపిక చేశారు. విప్ గా కడియం శ్రీహరిని నియమించారు. కాసేపటి క్రితం తన నివాసంలో పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో పార్లమెంటరీ కమిటీని కేసీఆర్ ఖరారు చేశారు.

  • Loading...

More Telugu News