: శరీరాకృతి విషయంలో సంతోషంగా ఉండేది పురుషులే


తమ శరీరాకృతి, అపియరెన్స్‌ విషయంలో మహిళల కంటె పురుషులే ఎక్కువ సంతృప్తిగా సంతోషంగా ఉంటారని ఓ తాజా అధ్యయనం చెబుతోంది. ఆధునికజీవనంలో 12 అంశాలమీద జరిగిన ఈ అధ్యయనంలో మొత్తం ఏడు రకాల అంశాల్లో పురుషులే ఎక్కువ సంతోషంగా గడుపుతున్నట్లు తేలింది. ప్రేమ, శృంగారం, కుటుంబం వంటి విషయాల్లో మాత్రం.. మహిళలే పురుషుల కంటె ఎక్కువ సంతోషంగా ఉంటున్నార్ట. స్థూలంగా చూస్తే.. సగటు బ్రిటన్‌ పౌరుల్లో 64 శాతం మంది సంతోషంగా ఉన్నట్లేనట.

బెనెడెన్‌ హెల్త్‌ వారు నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆరోగ్యం, నివాస ప్రాంతాలను బట్టి మహిళల సగటు సంతోషం ఆధారపడి ఉంటుందని కూడా తేల్చారు.

  • Loading...

More Telugu News