: రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకు తీవ్రగాయాలు... పరిస్థితి ఆందోళనకరం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ముంబయ్ వెళ్ళడానికి ఈ ఉదయం ఆయన ఢిల్లీ లోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా మోతీబాగ్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఆయనను ఎయిమ్స్ కు తరలించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స సమయంలో ఆయనకు హృద్రోగ సమస్య తలెత్తినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్టు సమాచారం.