: ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు సీరియస్
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్ ను నిరసిస్తూ రాజయ్య నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆయన గుండెకు రక్త ప్రసరణలో ఇబ్బందులున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆయనను భద్రాచలం నుంచి హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.