: ఈ నెల 9 నుంచి తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు: నాయిని
ఈ నెల 9 నుంచి తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించిందని ఆ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదులో కేసీఆర్ ఆధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయని అన్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకుంటామని తెలిపారు. రుణమాఫీపై బ్యాంకర్లతో సమావేశమైన అనంతరం నిర్ణయం తీసుకుంటామని నాయిని వెల్లడించారు.