: బలాన్ని పెంచే విటమిన్ డి
మన కండరాలు మరింత మెరుగ్గా పనిచేసేలా, మన శక్తిని పెంపొందించడంలో విటమిన్ డి ఎక్కువ ప్రభావం చూపిస్తుందని.. అమెరికా న్యూ కాజిల్ యూనివర్సిటీకి లోని భారతీయ సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త తన అధ్యయనం ద్వారా నిరూపించారు. విటమిన్ డి సప్లిమెంట్ల ద్వారా కండరాల పనితీరు మెరుగుపడుతుందని డాక్టర్ ఆకాశ్ సిన్హా నిరూపించారు. మైటోకాండ్రియా పనితీరును పెంచుతుందని అంటున్నారు. సాధారణంగా సూర్యరశ్మినుంచి చర్మంలో ఈ హార్మోన్ తయారవుతుంది. విటమిన్ డి చేపలు, గుడ్డు సొన , పప్పు ధాన్యాలు వంటి వాటిలో కూడా ఉంటుందని తేల్చారు. అయితే యూకేలో 60 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు ఆకాశ్ అధ్యయనం పేర్కొంది. ఐదేళ్ల లోపు పిల్లలు, నల్లటి చర్మం ఉన్నవారికి ఈ ప్రమాదాలు ఎక్కువట. విటమిన్ డి లోపం ఉన్న ఓ సమూహాన్ని అధ్యయనం చేసినప్పుడు ఈ విషయాలు కనుగొన్నారు. వారికి విటమిన్ డి సప్లిమెంట్లు ఇవ్వగానే కండరాల పనితీరు ఒక్కసారిగా మెరుగుపడిందిట.