: రాష్ట్రం సాకారమైన వేళ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు : రఘువీరారెడ్డి
60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైన వేళ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఢిల్లీలో సోనియా గాంధీని కలసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు సోనియా గాంధీకి వివరించానని రఘువీరారెడ్డి తెలిపారు. చట్టం అమలవ్వాలంటూ ప్రధానికి లేఖ రాయాలని సోనియా గాంధీకి సూచించామని రఘువీరా తెలిపారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.