: చిత్తూరు జిల్లాలో ఈదురుగాలులు, నేలకూలిన భారీ వృక్షాలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఇవాళ బలంగా ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేల కూలాయి. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లె వద్ద చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చెట్లను తొలగించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో తలమునకలయ్యారు.