: పార్టీకి నష్టం కలిగించిన వారిపై చర్యలు ఉంటాయి: ధర్మాన
పార్టీకి నష్టం కలిగించిన వారిపై దృష్టి సారించామని... త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని... కమిటీ నివేదికను బట్టి నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని గుర్తించే విషయంలో విశాల దృక్పధంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ రోజు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.