: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు
కేసీఆర్ కేబినెట్ లోని 11 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. మహమూద్ అలీ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు రెవెన్యూ శాఖను కూడా నిర్వర్తించనున్నారు. టి.రాజయ్యకు రెండవ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు వైద్య, ఆరోగ్య శాఖను కూడా కట్టబెట్టారు. మిగిలిన మంత్రులకు కేటాయించిన శాఖలు ఈ విధంగా ఉన్నాయి.
* నాయిని నర్శింహారెడ్డి - హోం శాఖ
* ఈటెల రాజేందర్ - ఆర్థిక శాఖ, పౌరసరఫరాల శాఖ
* పోచారం శ్రీనివాసరెడ్డి - వ్యవసాయ శాఖ
* టీ హరీష్ రావు - భారీ నీటి పారుదల శాఖ, శాసనసభ వ్యవహారాలు
* పద్మారావు - ఎక్సైజ్ శాఖ
* కేటీఆర్ - ఐటీ, పంచాయతీరాజ్ శాఖ
* మహేందర్ రెడ్డి - రవాణా శాఖ
* జోగు రామన్న- అటవీ, పర్యావరణ శాఖ
* జగదీశ్ రెడ్డి - ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ.